ఇండియన్ 2 ఫ్లాప్ తర్వాత గేమ్ ఛేంజర్‌పై దృష్టి సారించారు దర్శకుడు శంకర్. డిసెంబర్‌లో సినిమా రిలీజ్ కానుందని అనౌన్స్ చేయగా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోండగా రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన జరగండి…జరగండి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా క్రిస్మస్ సందర్భంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి.
పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి సొంతం చేసుకుంది.