Sunday, May 4, 2025
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త!

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపదించుకున్నాడు ప్రభాస్. గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. ఎకంగా ఓ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఈ అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే పుకార్లు వచ్చాయి.

ఈ పుకార్లను ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు ఖండించిన విషయం తెలిసిందే. తాజా గా కృష్ణం రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ పెళ్లిపై ఓ క్లారిటి ఇచ్చి ఈ సంవత్సరంలోనే జరగబోతుందని తెలియజేసారు. ప్రస్తుతం ప్రభాస్ కోసం అమ్మాయిని చూస్తున్నాం.

ప్రభాస్‍ ప్రేమ వివహం చేసుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలియజేసారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కృష్ణం రాజు స్వయనిర్మాణ సంస్థ గోపీకృష్ణమూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా ఓ ప్రేమకథ చిత్రాన్ని తెరకేక్కించబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు. అలాగే రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -