Saturday, May 3, 2025
- Advertisement -

పవన్ దర్శకుడితో రామ్ పోతినేని!

- Advertisement -

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో, దర్శకుడితో త్వరలో సినిమా రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు పవన్. ఈ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు హరీష్ శంకర్. తన తర్వాతి సినిమా రామ్‌ పోతినేనితోనే ఉంటుందని, ఈ సినిమాను నిర్మాత కృష్ఱ నిర్మిస్తారని తెలిపారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ఇద్దరు కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం రామ్ ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తుండగా ఈ సినిమాకు డబుల్‌ ఇస్మార్ట్‌ అనే టైటిల్ ఖరారు చేస్తున్నారు. మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -