Sunday, May 4, 2025
- Advertisement -

దేవర పార్ట్-2లో ఆకట్టుకుంటా!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లకానుంది.

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి జాన్వీ క‌పూర్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించింది. దేవ‌ర సినిమాతో సౌత్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ..త‌న పాత్ర బాగుంటుంద‌ని చెప్పుకొచ్చింది. పార్ట్-2లో త‌న పాత్రకు మ‌రింత స్కోప్ ఉంటుంద‌ని చెప్పడంతో జాన్వీ పాత్రపై అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -