Wednesday, May 7, 2025
- Advertisement -

లీక్ అయిన ‘జ‌న‌తా గ్యారేజీ’ డైలాగులు!

- Advertisement -

నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మిర్చి, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా పై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా అంటే… డాన్స్ లు, అద్భుతమైన డైలాగులు ఉంటాయి అని అభిమానులు ఆశ పడుతారు. అభిమానులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు జనతా గ్యారేజ్ టీం. అయితే జ‌న‌తా గ్యారేజీలోనూ బోల్డ‌న్ని డైలాగులు రాసేశాడు కొరటాల శివ. ఇందులో కొన్ని లీక్ అయ్యాయంటూ నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ డైలాగులు లీయ‌య్యాయా, లేదంటే అభిమానులే సృష్టించారా ? అన్నది ప్రస్తుతానికి తెలియదు గానీ.. ఓ నాలుగు డైలాగులు వెబ్ లో సందడి చేస్తున్నాయి.

ఆ డైలాగులు ఇవే..

1. బండి రిపేరు చేయ‌డానికి రెంచులు కావాలేమో.. నిన్ను రిపేరు చేయ‌డానికి నా చేతులు చాలు…

2. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ, భయం వేస్తే తోడుగా ఉండే నాన్న లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనిషికి అంతకు మించి నరకం ఉండదు.

3. లక్ష్మణరేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి నేను లక్ష్మణుడ్ని కాదు.. లక్ష సముద్రాలైనా దాటి ఆపదలో ఉన్నవాళ్లను కాపాడటానికి దూకే వీరాంజనేయుడిని.

4. అన్న గ్యారేజీలో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్ట్ లు కూడా రికవరీ చేసేస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -