టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మిర్చి, శ్రీమంతుడు సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది.ఇదిలా ఉంటే గ్యారేజ్ స్టోరీ లైన్ ఇదేనంటూ టాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో ఓ స్టోరీ హల్‌చల్ చేస్తోంది. ఈ లైన్ ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ ఓ పెద్ద డాన్. అతని తమ్ముడు సాయికుమార్ సాఫ్ట్ పర్సన్. అయితే, డాన్ గా అందరిని భయపెట్టిన వ్యక్తి కొన్ని కారణాల వలన డాన్ వృత్తి నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన మోహన్‌లాల్ ముంబైలో జనతా గ్యారేజ్ స్థాపిస్తాడు. ఇక ఐఐటి స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో తన పెదనాన్నకు సహాయపడుతుంటాడు.
ముంబైలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మోహన్ లాల్ డాన్ పెద్ద డాన్ అన్న విషయం ఎన్టీఆర్ కు తెలుస్తుంది. డాన్ గా అందరిని హడలెత్తించిన మోహన్ లాల్ ఎందుకు ముంబైలో గ్యారేజ్ పెట్టుకుని సైలెంట్‌గా ఉన్నాడో తెలుసుకునేందుకు ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగింది, డాన్‌గా మోహన్‌లాల్ కోల్పోయింది ఏమిటి…ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్టీఆర్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే మిగిలిన స్టోరీ అని తెలుస్తోంది. మరి ఈ స్టోరిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.