సంక్రాంతికి రాబోతున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా పై ఇటు అభిమానులోను, సినీ పరిశ్రమలోను భారీగా అంచనాలు ఉన్నాయి. అందులోను ఈ సినిమా ఎన్టీఆర్ కు 25వ చిత్రం కావడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి.
సుకుమార్ డైరెక్షన్, ఎన్టీఆర్ స్టైలిష్ లూక్, రకుల్ అందాలు, విలన్‌గా జగపతి బాబు, ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, బివిఎన్‍ఎస్ ప్రసాద్ నిర్మాణం ఇంత పెద్ద మొత్తం లో నాన్నకు ప్రేమతో సినిమా రెడి అయింది. తాజా ఈ సినిమా కథ సోషల్ మీడియలో హల్చల్ చేస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎన్టీఆర్ తండ్రి రాజేంద్ర ప్రసాద్‍ను విలన్ అయినటువంటి జగపతి బాబు మొసం చేస్తే విలన్ పై ఎన్టీఆర్ ఎలా పగ తీర్చుకున్నాడు, అసలు రాజేంద్ర ప్రసాద్‍కు జగపతి బాబు కి సంబంధం ఏంటీ? అనే కథ తో నడుస్తుందని అర్ధం అవుతుంది. ఇలాంటి కథలతో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి.
ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కథ ఎలా ఉన్నా కథనం బాగుంటుందని, ఎందుకంటే సుకుమార్ తన మార్క్ కథనంతో ఈ సినిమా స్టోరి నడిపిస్తాడని, అందులోను ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడని. ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రికార్డ్‌లు సృష్టిస్తుందని అంటున్నారు. మరి సంక్రాంతి బరిలో ఈ సినిమకి ఏలాంటి ఫలితం వస్తుందో చూడాలి మరి.