Sunday, May 4, 2025
- Advertisement -

కన్నప్పలో చంద‌మామ‌ కాజల్

- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ తమ పాత్రల షూటింగ్‌ని పూర్తి చేయగా ఈ నెల 20న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా టీజర్‌ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సౌత్‌కు చెందిన వివిధ ఇండస్ట్రీల నటులు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగస్వాములు కాగా తాజాగా అందాల చందమామ కాజల్ కూడా చేరిపోయింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించగా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కన్నప్ప మూవీ న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుండగా ఫ్రాన్స్ లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా బృందం పాల్గొననుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -