నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD.ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలకపాత్ర పోషిస్తున్నారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడిపిస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీ టౌన్‌లో టాక్. మే 22న ఈ మెగా ఈవెంట్ జరగనుండగా ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు అశ్వినీదత్. మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతోంది.