Saturday, May 3, 2025
- Advertisement -

500 కోట్ల క్లబ్‌లో కల్కి!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ క్లాస్ మూవీ కల్కి 2898AD.ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక నాలుగో రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది కల్కి.

దేశంలో తొలి రోజు రూ. 95.3 కోట్లు, 2వ రోజు రూ. 57. 6 కోట్లు, 3వ రోజున రూ. 64.5 కోట్లు రాబట్టిన కల్కి నాలుగో రోజు తెలుగులో 84.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. 4వ రోజు ఆదివారం కావడంతో కల్కి వసూళ్లు పెరిగిపోయాయి. ఇండియా మార్కెట్‌లో రూ. 85 కోట్లు వసూలు చేసింది.

నాలుగోరోజు తెలుగులో రూ. 36.8 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, హిందీలో రూ. 39 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇండియా మార్కెట్‌లో ఈ నాలుగు రోజుల్లో రూ. 302.4 కోట్లను రాబట్టింది కల్కి. వరల్డ్ వైడ్‌గా రూ. 500 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -