Saturday, May 3, 2025
- Advertisement -

మరో బయోపిక్‌లో కీర్తి సురేష్‌?

- Advertisement -

మరో బయోపిక్‌లో నటించేందుకు నటి కీర్తి సురేష్ సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహానటి బయోపిక్‌లో సావిత్రిగా ఒదిగిపోయిన కీర్తి ఇప్పుడు లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మీ పాత్రలో నటించనున్నారని టీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.

త్వరలోనే ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్ వెండితెరపై రానున్న సంగతి తెలిసిందే. చిన్ననాటి నుంచే సంగీతమే తన ఊపిరిగా మార్చుకున్నారు సుబ్బలక్ష్మీ. తన గాత్రంతో ఎంతోమందిని అలరించారు. ఇక సుబ్బలక్ష్మీ పాత్రకు కీర్తి సురేష్ అయితేనే సెట్ అవుతుందని భావించారట.

ఒకవేళ కీరతి కాదంటే నయనతార లేదా త్రిషకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనుండగా త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -