Sunday, May 4, 2025
- Advertisement -

కొర‌టాల నెక్స్ట్ మూవీ బన్నీతోనేనా!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘భరత్ అనే నేను’ ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఏ హీరోతోనూ ఇంతవరకూ కొరటాల కమిట్ కాలేదు. ‘భరత్ అనే నేను’ రిలీజ్ అయిన తరువాత ఆ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కొర‌టాల లైన్లో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ ఉన్నారు.ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్ సినిమా త‌రువాత మ‌రో సినిమా వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ఉంటుంద‌ని కొర‌టాల‌-ఎన్టీఆర్ ఇద్ద‌రు ప్ర‌క‌టించారు.ఇక రాంచ‌ర‌ణ్‌తో ఓ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన త‌రువాత వివిధ కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. భ‌ర‌త్ అను నేను సినిమా త‌రువాత రాంచ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుంద‌ని అంతా భావించారు.

కాని రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా త‌రువాత బోయ‌పాటి సినిమాకు షిఫ్ట్ అయ్యాడు.ఇప్పుడు కొర‌టాల లైన్లోకి మ‌రో హీరో వ‌చ్చి చేరాడు.అత‌ను ఎవ‌రో కాదు…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.ప్ర‌స్తుతం అల్లు అర్జున్ వ‌క్కంతం వంశీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచియం చేస్తు నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 4న విడుద‌ల కానుంది.ఈ సినిమా త‌రువాత బ‌న్నీ మ‌రో సినిమా క‌మిట్ కాలేదు.ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉన్నాడు, కాబ‌ట్టి ఇక కొర‌టాల శివ‌,అల్లు అర్జున్ ఇద్ద‌రు కలిసి సినిమా చేస్తార‌నే టాక్ ఎక్కువుగా విన‌బ‌డుతుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -