మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వరుణ్ – లావణ్య ఇద్దరూ వారి వారి కెరీర్‌లో బిజీ అయ్యారు. ఇక లావణ్య మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు, క్యారెక్టర్స్ ఎంపికలో వరుణ్‌తేజ్‌తో పాటు అతడి ఫ్యామిలీ తనకు ఎలాంటి కండీషన్స్ పెట్టలేదని స్పష్టం చేసింది.
ఓటీటీ, సినిమాలు అనే భేదాలు నాకు లేవని, నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది లావణ్య. మిస్ పర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్‌తో పాటు ప్రస్తుతం రెండు సినిమాలు కూడా చేస్తున్నానని తెలిపింది. తన కంటే భర్త వరుణ్ తేజ్ చాలా పర్‌ఫెక్షనిస్ట్ అని…మెగా కోడలు అనే ట్యాగ్ నటిగా తన బాధ్యతను పెంచిందని చెప్పుకొచ్చింది లావణ్య.
లావణ్య త్రిపాఠి అన్న పేరును కష్టపడి తాను నిలబెట్టుకున్నానని…తన మిస్ పర్‌ఫెక్ట్‌తో పాటు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఒకే నెలలో రిలీజ్ కావడం ఆనందంగా ఉందన్నారు. పులి మేక తర్వాత లావణ్య త్రిపాఠి చేస్తోన్న వెబ్ సిరీస్ ఇది కాగా విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు.