అందాల రాక్షసిగా వచ్చిన లావణ్య త్రిపాటి… ఆ సినిమాలో ఉన్నంత అమాయకురాలైతే భయట కానేకాదు. అమ్మడు ఎంతో లౌక్యంతో కొన్ని కోటరీలను సెలక్ట్ చేసుకుంటుంది.
ఆ కోటరీల ద్వారానే ఆఫర్లను చేజిక్కించుకుంటూ కో స్టార్స్ మతులు పోగొడుతుంది. ఇప్పటి తరం హీరోయిన్లలో ఎవ్వరికీ లేని టాలెంట్ తో యేషాలేస్తోంది. అలా చేస్తూ …. క్రేజ్ వెంచర్లకు బుక్ అయిపోతోంది. అందాల రాక్షసితో ఎంట్రీ ఇచ్చినప్పటికీ..ఆ సినిమాలో కేవలం పర్ పార్మెన్స్ గాళ్ గానే నోటెడ్ అయింది.
ఆతరువాత చేసిన సినిమాలు చూస్తే ఓ కోటరీని పట్టుకుని వెళ్లినట్లుగా కనిపిస్తుంది. మంచు ఫ్యామిలీ,అక్కినేని కుటుంభాలతో చనువుగా ఉంటూవారి చిత్రాల్లో మంచి పాత్రలు పట్టేసింది. లావణ్య ఎంతో లౌక్యంతో పడుతోన్న ఆఫర్లు చాలవన్నట్లుగా… తాజాగా బాహుబలిలో రానాకు వైఫ్ పాత్రలో తళుక్కుమనబోతోంది. ఈసినిమాలో ఆమె చేసే పాత్ర ఎలా ఉంటుందనే దానిపై కాస్త గట్టిగానే చర్చ నడుస్తోంది.
అయితే ఈ లోపు ఆమె నాగ్ తో చేస్తోన్న సోగ్గాడే చిన్ని నాయన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి..లావణ్య యాక్టింగ్లోని మరో షేడ్ మనకు కనిపించడం ఖాయం. భలే భలే మగాడివోయ్ తో అటు అల్లు కాంపౌండ్ ను ప్రసన్నం చేసుకున్న లావణ్య…. ఆ తరువాత బన్నీతో చేసే ఓ సినిమాలో ఖచ్చితంగా ఆఫర్ ను అందిపుచ్చుకుంటుందనుకున్నారంత. కాని అలాంటిదేమి జరగలేదు.
అయితే ఆమె చేతిలో ఉన్న క్రేజీ వెంచర్ల షూట్ ఫినిష్ అయితే తప్ప…. బన్నీ లేదామెగా హీరోలతో లావణ్య యాక్ట్ చేయలేదని చెబుతున్నారు. స్క్రీన్ లుక్ లో ఏమాత్రం హొయలు వలకబోయని ఈ భామ కోటరీలలోకి చేరి భలే బలే ఆఫర్లను లావణ్య లౌక్యంతో ఎగరేసుకుపోతుందని తోటి స్టార్స్ గోల పెడుతున్నారు.