Tuesday, May 6, 2025
- Advertisement -

అది నా నిర్ణయం మేరకు జరిగిందే!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత వారం విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా, సినిమా మాత్రం వారిని అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది.

ఈ నేపధ్యంలో అందరూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదే తప్పని, ఆయన టీవీ సీరియల్ లాగ తీసారని, మహేష్ నమ్మి మోసపోయారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లిన మహేష్, వెళ్లేముందు తన టీమ్ తో …తనే ఈ ఫ్లాఫ్ కు భాధ్యత వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం..మహేష్ తన టీమ్ తో మాట్లాడుతూ…ఫ్లాఫ్ కు శ్రీకాంత్ అడ్డాలని బ్లేమ్ చేయటం అపమని, అదే తన అభిమానులకు సైతం చెప్పమని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏం జరిగినా, ఎలాంటి అవుట్ పుట్ వచ్చినా అది నా నిర్ణయం మేరకు జరిగిందే. సినిమ ఫ్లాఫ్ అయితే అది నా జడ్జిమెంట్ లోపంతో జరిగింది. అందుకు శ్రీకాంత్ అడ్డాల గారు ఏం చేస్తారు అని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది.

తొలి నుంచీ మహేష్ ఒకటే చెప్తూ వస్తున్నారు. తన సినిమా హిట్ అయితే టీమ్ ఎఫెర్ట్. ఫ్లాఫ్ అయితే తన జడ్జిమెంట్ సమస్య అని. ప్లాఫ్ అయింది కదా అని వేరే వాళ్ల మీదకు తోసేసే మనస్తత్వం కాదు మహేష్ ది. ఇప్పుడు తన తాజా చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ కు కూడా దర్శకుడుని బ్లేమ్ చేయటం అనవసరం అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -