Saturday, May 3, 2025
- Advertisement -

గుంటూరు కారం…ఆ నాలుగే బ్యాలెన్స్!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోండగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా మెలోడి నేపథ్యంలో ఉండనుందట. త్వరలోనే ఈ సాంగ్‌ని రిలీజ్‌ చేయనుండగా ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. సినిమాలో మరో నాలుగు పాటలు షూట్ బ్యాలన్స్ ఉండగా డిసెంబర్ నాటికి అన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారని సమాచారం.

మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల లు హీరోయిన్స్ నటిస్తుండగా త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్ర ఇది. విడుదలకు ముందే భారీ హైప్ నెలకొనగా మరి ఆ అంచనాలను మహేష్ అందుకుంటాడా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -