అర్జున్ రెడ్డి ఓ రేంజ్ సూపర్ హిట్ కావడంతో.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ చేయబోయే సినిమాపై చాలా అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ డైరెక్టర్ ఇటివలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించాడని.. తనతో సినిమా చేసే అవకాశంపై కూడ ప్రాధమికంగా చర్చలు జరిగాయని సందీప్ రెడ్డి లీకులు ఇస్తున్నాడు. అంతేకాకుండా త్వరలోనే మహేష్ ను కలబోతున్నట్లు.. ఈ మేరకు తాను నమ్రతతో చర్చలు కూడా జరిపినట్లు సందీప్ రెడ్డి చెపుతున్నాడు. అంతేకాదు తన మైండ్ లో ఒక మంచి స్టోరీ లైన్ ఉందని.. ఆ స్టోరీ లైన్ మహేష్ తో సినిమాగా రాబోతోంది అంటూ లీకులు ఇస్తున్నాడు.
ఇంతవరకు విషయం బాగానే ఉన్నా ఇప్పటికే మురగదాస్ ప్రయోగంలో మహేష్ చిక్కుకుని పొరపాటు చేసాడు అని అభిమానులు కలవర పడుతున్నారు. అయితే మహేష్ స్పైడర్ సూపర్ హిట్ అయితే.. మహేష్ సందీప్ రెడ్డితో ప్రయోగంకు ఓకే చెప్పే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే సందీప్ రెడ్డి మహేష్ తో సినిమా చేసి హిట్ కొడితే.. ఖచ్చితంగా టాప్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.