Sunday, May 4, 2025
- Advertisement -

చిరు టైటిల్ కు మహేష్ ఓకే చెబుతాడా?

- Advertisement -

పెద్ద హీరోల సినిమాల మొదలవుతోందంటే చాలు. టైటిల్ ఇదనీ.. స్టోరీ లైన్ ఇదనీ ప్రచారం మొదలవుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ ప్రచారాలు నిజమవుతూ కూడా ఉంటాయి. అందుకే.. ఫ్యాన్స్ తో పాటు. .మూమూలు ప్రేక్షకుల్లోనూ ఇలాంటి ప్రచారాలపై ఆసక్తి కనిపిస్తుంటుంది.

ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు.. త్వరలో మురుగదాస్ డైరెక్షన్ లో మూవీకి ఓకే చెప్పాడు. ఇప్పుడు.. ఆ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

న్యాయ వ్యవస్థలోని లొసుగుల ఆధారంగా మురుగదాస్ తీస్తున్న ఈ సినిమా.. ఒకేసారి తెలుగు, తమిళం.. వీలైతే హిందీలో కూడా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు చట్టంతో పోరాటం అనే టైటిల్ ను మురుగదాస్ ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇదే పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ విషయం మురుగదాస్ కు తెలుసో లేదో ఎవరికీ తెలియదు. కానీ.. సినిమా టైటిల్ పై ప్రచారం మొదలైంది.

ఇదే కనుక నిజమైతే.. మురుగదాస్ ప్రపోజల్ ను మహేష్ ఓకే చేస్తాడా? తనకు నచ్చకుంటే ఎంతటి పెద్ద విషయాన్నైనా లైట్ తీసుకునే మనస్తత్వం మహేష్ ది. గతంలో శంకర్ లాంటి డైరెక్టర్ సినిమా ఆఫర్ చేసినా డైరెక్ట్ గా నో చెప్పేశాడు. రీసెంట్ గా లెజెండరీ దర్శకుడు మణిరత్నం చెప్పిన స్టోరీ లైన్ నూ మహేష్ వద్దనుకున్నాడు. మరి.. చిరు టైటిల్ ను తన కొత్త సినిమాకు ప్రిన్స్ అంగీకరిస్తాడో లేదో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -