విష్ణు మంచు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం,కాజల్ తదితరులు నటిస్తుండగా ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ తమ పాత్రల షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఇక ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చెప్పినట్లుగానే మే 21న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా టీజర్‌కు మంచి స్పందన వచ్చినట్లు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ప్రేక్షకులకు మాత్రం జూన్ 13న టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపి డిసప్పాయింట్ చేశారు విష్ణు. అయితే అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, స్థానిక భారతీయులతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో బాగుందని మెచ్చుకున్నారని వెల్లడించారు.
ఇప్పటికే కన్నప్ప మూవీ న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకోగా రామోజీ ఫిలిం సిటీలో సైతం కీలక షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుంది.