గరుడవేగ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసింది. అన్ని చోట్ల ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ కి ఈ సినిమా ఎంతో ఉపయోగపడిందని.. ఈ సినిమాలో అతని నటన అద్భుతం అని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం కూడా ఈ సినిమాకి ప్లస్ అయిందని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.
ఏది ఏమైన ఓ కొత్త సినిమా చూసిన ఫీల్ కలుగుతుందని ఖచ్చితంగా కలుగుతోంది. ‘గరుడవేగ’ సినిమా యాంగ్రీ యంగ్‌మెన్‌కు మళ్లీ కం బ్యాక్ ఫిలింగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ రిలీజ్ కాకముందు.. ఈ సినిమా చూడాలని రాజశేఖర్, జీవిత కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అందుకు ఆయన కూడా ఖచ్చితంగా చూస్తానని.. ఇటివలే ట్రైలర్ చూసానని.. ట్రైలర్ అద్భుతంగా ఉందని తెలిపాడు. అయితే సినిమా రిలీజ్ కావడంతో ఆయన ప్రత్యేకంగా ఈ షోని వెయించుకొని చూసారట. రాజశేఖర్ కోరిక మేరకు ఈ సినిమా చిరు చూసినట్లు తెలుస్తోంది.
సినిమా చూసిన తర్వాత చిరు.. వెంటనే రాజశేఖర్ కి కంగ్రాట్స్ చెప్పాడట. ఓ కొత్తరకం సినిమా చేశావ్.. పరంగా అద్భుతంగా చేశావ్. ఇలాంటి కథ నమ్మి చేసినందుకు నీకు మంచి ఫలితం దక్కుతుందని అభినందించాడట. అలానే దర్శకుడు కథనం నడిపించిన విధానం చాలా బాగుందని.. ఆయన ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడట. అలానే ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని చిరు అభినందించినట్లు తెలుస్తోంది.