యంగ్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంత ఫేమసో ఆయన లవ్ ఎఫైర్స్ కూడా అంతే ఫేమస్.ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ చాలా మంది హీరోయిన్లతో లవ్‌లో ఉన్నట్లు అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు హీరోయిన్ ఛార్మీతో మనోడు ప్రేమయాణం సాగించాడు అని వార్తలు హల్ చల్ చేశాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరు చాలా ఈవెంట్స్‌కు కలిసి వచ్చారు. తరువాత ఏమి జరిగిందో తెలియదు కాని వీరిద్దరు విడిపోయారు.ఛార్మీ తరువాత దేవిశ్రీ అత్తారింటికి దారేది సయమంలో హీరోయిన్ ప్రణీతతో ప్రేమలో ఉన్నాడు అని న్యూస్ వచ్చింది.ప్రస్తుతం దేవిశ్రీ ఫోకస్ మరో హీరోయిన్‌పై షిఫ్ట్ అయ్యిందని సమాచారం.
రంగస్థలం సినిమాలో రాంచరణ్‌కి చెల్లిలుగా చేస్తున్న పూజితతో దేవిశ్రీ చాలా డీప్‌గా లవ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లారని ఎక్కడ చూసిని ఈ జంటే కనబడుతుందని సమాచారం.ఇప్పటీకే దేవిశ్రీకి మూడు పదుల వయస్సు దాటి చాలా కాలం అయ్యింది.ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేసుకొవాలని దేవిశ్రీ భావిస్తున్నాడు అంటా.ఇదే నిజం అయితే దేవిశ్రీ పూజితల పెళ్లి దగ్గర్లో ఉన్నట్లే.