Sunday, May 4, 2025
- Advertisement -

నా సామిరంగ…మాస్ జాతరే!

- Advertisement -

విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం నా సామిరంగ. గతేడాది సంక్రాంతికి సొగ్గాడే చిన్నినాయనతో హిట్ కొట్టిన నాగ్ ఈ ఏడాది నా సామిరంగతో మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించారు. ఈ రీమేక్ లో రాజ్ తరుణ్ పాత్రని కొత్తగా జత చేశారు.

మలయాళ మూవీ పోరింజు మరియం జోస్‌కి రీమేక్‌గా తెరకెక్కగా కీరవాణి సంగీతం అందించారు. నాగ్ సరసన ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స్ ఆకట్టుకోగా ట్రైలర్‌ను ఆధ్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -