Sunday, May 4, 2025
- Advertisement -

అలాంటివాడు మావాడైన పరాయివాడే!

- Advertisement -

మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మెగాఫ్యామిలీలో కలకలం రేపింది. మాతోనే ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు, మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడేనని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బన్నీని ఉద్దేశించి చేసిందేనని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది.

అయితే దీనిని నాగబాబు కార్యాలయం ఖండించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు.

దీనిపై జనసేన నాయకులు ట్రోల్‌ చేయగా బన్నీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తన మిత్రుడి గెలుపు కోసం వచ్చానని చెప్పినా వివాదం చల్లారలేదు. మెగా కుటుంబంలో సైతం అల్లు అర్జున వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున పర్యటనకు ముందుస్తు అనుమతి లేకపోవడంతో ఆయనపై కేసు నమోదైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -