తన కెరీర్ లో ఇప్పటివరకూ యాభై కోట్ల సినిమా దక్కించుకోలేక పోయిన జూనియర్ ఎన్టీఆర్ .. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తో ఎలాగైనా అది రీచ్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఎన్టీఆర్ కంటే కూడా ఆయన ఫాన్స్ ఈ విషయంలో చాలా ఆసక్తి గా ఉన్నారు మరి. నిజానికి కసిగా ఉన్నారు. కొత్త గెటప్ తో ఎన్టీఆర్ అదిరిపోయాడు కానీ విడుదల తేదీ మాత్రమే ఇంకా బయటకి రాలేదు.
రిలీజ్ విషయంలో సంక్రాంతి పండుగ రోజును అంత సీరియస్ గా తీసుకోవడానికి కూడా… ఈ యాభై కోట్ల క్లబ్ లో ఎంట్రీ కోసమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. టెంపర్ సూపర్ హిట్ కొట్టినా కూడా ఆ సినిమా నలభై మూడు కోట్ల దగ్గరే ఆగిపోయింది. అంత మంచి కథ ఆ మార్క్ కి తీసుకునివెళ్ళలేక పోవడం ఒక రకంగా బాధాకర విషయమే.దీంతో ఇప్పుడు ఈ మార్క్ తారక్ కి ప్రెస్టేజ్ క్వశ్చన్ గా మారిపోయింది.
అలాగని దీన్ని అందుకోవడం అంత సలుభమైన విషయమేమీ కాదు. ముఖ్యంగా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ లేకపోతే మాత్రం.. మరోసారి నిరుత్సాహపడాల్సి వస్తుంది. బాలయ్య తో డైరెక్ట్ పోటీ ఇబ్బంది కలిగించే విషయం. ” ఫాన్స్ నన్ను ‘నాన్నకు ప్రేమతో’ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు, నాకైతే ఏమీ తెలీదు. తెలిస్తే బాగుండేది. ఏం జరుగుతోంది అని విషయం మీద అసలు భారీ కన్ఫ్యూజన్ లో ఉన్నాను ” అంటూ తారక్ ట్వీట్ వేసాడు.
కొన్ని నిమిషాల తరవాత మళ్ళీ డిలీట్ కూడా చేసాడు. ఏం జరుగుతోంది ఎన్టీఆర్ కే కాదు ఫాన్స్ కీ ప్రేక్షకులకీ కూడా అర్ధం కావడం లేదు . బాలయ్య తో పోటీ విషయంలో ఎవరో తారక్ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తోంది. మనసు విప్పి ఇబ్బంది ఏంటో చెప్పుకుంటే బాగుంటుంది కదా ఎన్టీఆరూ ?