‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ ఆపేసిన నాని

- Advertisement -

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో లో ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. ఆ వార్తలు సద్దుమణిగాయి అనుకునే లోపు ఈ సినిమా గురించి మరి కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సినిమా చాలా పర్ఫెక్ట్ గా రావాలని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని బాగా వచ్చినా కూడా మళ్లీ మళ్లీ రీషూట్ చేస్తున్నారని దీంతో బడ్జెట్ తడిసి మోపెడు అయిపోతోందని నిర్మాత కంగారు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మరోవైపు నాని ఈ సినిమా షూటింగ్ ఆపేసి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో దర్శకుడిని మళ్ళీ రమ్మని చెప్పినట్లు సమాచారం. షూటింగ్ లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని నాని దర్శకుడితో ఇలా చెప్పినట్లు కొందరు అంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ నుంచి మాత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు అభిమానులు మాత్రం ఈ సినిమా బాగా రావాలని నాని మళ్ళి హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఈ సంవత్సరం అక్టోబర్లో దసరా సందర్భంగా విడుదల కాబోతుంది. కానీ షూటింగ్ వాయిదా పడితే సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -