- Advertisement -
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బాలయ్య…హీరోయిన్ అంజలిని నెట్టేయడం, మందుకొట్టి ఫంక్షన్‌కు వచ్చాడని ఫంక్షన్‌కి వచ్చాడని అక్కడున్న వారే చెబుతుండటంతో చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ దర్శకుడు సైతం బాలయ్య తీరును తప్పుబట్టారు.
ఇక నెటిజన్లు బాలయ్యను తెగ ట్రోల్ చేస్తుండగా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలయ్య మందు కొట్టి రాలేదని, అలాగే హీరోయిన్ అంజలిని కావాలని నెట్టేయలేదని కవర్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం బాలయ్యను ఇప్పటికి ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
బాలయ్య కాళ్ల దగ్గర మందుబాటిల్ ఉంది సీజీ అంటూ చెప్పడంతో ఇప్పుడు నాగవంశీని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇంత వయసు వచ్చినా బాలయ్య తన ప్రవర్తన మార్చుకోకపోవడం సరికాదని సూచిస్తున్నారు.