టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటివలే నటించిన బ్రహ్మోత్సవం అభిమానులను అలరించడంలో విఫలం అయింది. ఇప్పుడిప్పుడే మహేష్ ఆ సినిమా నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళుతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సామాజిక నేపద్య కధను కమర్షియల్‌గా చెప్పడంలో దిట్ట అయిన మురుగదాస్ మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నదనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తుండటం విశేషం.
ఇక ఈ సినిమా తరువాత ఊపిరి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో చెప్పారు మహేష్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ సరసన మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా చేయబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన మెగా డాటర్ మహేష్ వంటి సూపర్ స్టార్ సరసన జోడీ కడుతుందనే విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.