ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 4.5 కోట్ల సెట్లో ఈ మూవీ షూటింగ్ 27 రోజుల పాటు జరగనుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ సర్దార్ సెట్ లోని కొన్ని ఫోటోస్ విడుదల చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. సంక్రాంతికి అందరు హీరోలు తమ షూటింగ్‍లకు గ్యాప్ ఇచ్చి సంక్రాంతికి హాలిడే టూర్ వెళ్ళుతున్నారు. మెగా ఫ్యామీలి హాలిడే ని ఎంజాయ్ చెయ్యడం కోసం బెంగళూర్ కి వెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాత్రం ‘సర్దార్’ మూవీ షూటింగ్ బిజీ లో ఉండి సంక్రాంతి కి హాలిడే ని తీసుకోవడం లేదట. ఎలాంటి బ్రేక్ లేకుండా సర్దార్ షెడ్యూల్ పూర్తి చేయాలి అని పవన్ ఫిక్స్ అయ్యాడట. అభిమానుల కోసం ఈ సినిమాని తొందరగా కాంప్లీట్ చేసి సమ్మర్‌లో గిప్ట్ గా ఇవ్వాలి అని బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారట.