Monday, May 5, 2025
- Advertisement -

వీరమల్లు అటకెక్కినట్లేనా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ ర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా అనేక బ్రేక్‌లు పడుతూ వస్తోంది.అయితే తాజాగా ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సినిమాలకు పవన్ పూర్తిగా గ్యాప్ ఇవ్వడంతో లైన్‌లో ఉన్న మూవీలు అటకెక్కాయి.

ఇందులో క్రిష్ సినిమా కూడా ఉండటం విశేషం. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. పవన్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటి వరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. హరిహర వీరమల్లు పెండింగ్‌లో ఉండటంతో క్రిష్ వేరే సినిమా పై దృష్టి సారించారట. ఓ లేడిఓరియెంటెడ్ కథను సిద్ధం చేయగా ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోందని టాక్. మొత్తంగా హరిహర వీరమల్లు ప్రాజెక్టు ఇప్పట్లో ఉండే అవకాశం లేనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -