Wednesday, May 7, 2025
- Advertisement -

ఎన్టీఆర్‌ను ‘ఎన్’ అక్షరమే కాపాడాలి!

- Advertisement -

సినీ పరిశ్రమలో హీరోలు సెంటిమెంటులు బాగా నమ్ముతారు. ఒక్కసారి సెంటిమెంట్ వర్క్అవుట్ అయిందంటే ఇక ఆ సెంట్మెంటునే అనుసరిస్తారు. సెంటిమెంట్ విషయంలో హీరోలకు చాలా నమ్మకాలు ఉంటాయి. సినిమా టైటిల్ మొదటి అక్షరం కలిసి వస్తే మళ్ళీ ఆ అక్షరం తోనే సినిమా టైటిల్స్ పెట్టి సెంటిమెంటులు నమ్ముతారు.

ఈ టైటిల్ విషయంలో చాలా జగ్రత్తగా ఉంటారు. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా టైటిల్ విషయంలో ఇప్పుడు అభిమానులో చర్చ జరుగుతుంది. నాన్నకు ప్రేమతో సినిమా ఎన్ అనే అక్షరంతో స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని, నా అల్లుడు, నాగ, నరసింహుడు  సినిమాలు ప్లాప్.

ఈ నాలుగు సినిమాలకు మొదటి అక్షరం ఎన్ తోనే స్టార్ట్ అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా ఎన్ తోనే స్టార్ట్ అయింది. ఈ విషయం పై కొందరు అభిమనులు అలోచిస్తుండగా ఇంకొందరు మాత్రం సినిమాల కథ బాగుంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.

కాని ఈ లాంటి సెంటిమెంట్స్ నమ్మకపోవడం మంచిది అనే వారు కూడా ఉన్నారు. మరి నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -