చేసుకోబోయే వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని తనకు పవన్ కల్యాణ్ సూచించినట్లు మాజీ భార్య రేణుదేశాయ్‌కు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే ఓ షోలో ప్రకటించింది. ఇటీవల తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని తెలిపిన నాటి నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయంలో తనకు పవన్ కొన్నిసూచనలు కూడా చేశారని తెలిపారు.
చేసుకోబోయే వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకుని ముందడుగు వేయాలని చెప్పారని అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు విషయాలు వెల్లడించింది. పవన్ కల్యాణ్ ఇటీవల మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పవన్‌కు ఫోన్ చేసి తాను శుభాకాంక్షలు తెలిపానని చెప్పింది. తల్లీ, కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు. తమ పిల్లలు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై చర్చ తమ మధ్య ఎన్నడూ రాలేదని రేణు తెలిపారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారన్నది తనకు తెలియకపోయినా.. పిల్లలకు ఒక తల్లిగా మాత్రం పవన్ తనను చాలా గొప్ప తల్లిగా భావిస్తారని పేర్కొన్నారు.