పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు యుట్యూబ్‍లో తెగ హల్ చల్ చేస్తుంది. సంక్రాంతికి కూడా బ్రేక్ ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్‍లో పాల్గొన్నాడు పవన్. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు.
ఎందుకుంటే పవన్ సింగపూర్ వేళ్ళానున్నాడు. కొన్ని రోజులుగా హైదరాబాద్‍లో షుటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‍కి సడెన్‌గా పవన్ బ్రేక్ ఇచ్చి సింగపూర్ వేల్తున్నాడు. సంక్రాంతికి కూడా బ్రేక్ తీసుకోని పవన్ సడెన్‍గా ఇప్పుడు ఎందుకు బ్రేక్ తీసుకున్నాడు అని అనుకుంటున్నారు అంతా.
ఐతే కాస్త రిలాక్స్ కోసం సింగపూర్ వెళ్లుతున్నారు అని తెలుస్తుంది. రెస్ట్ తీసుకోని రాగానే షుటింగ్ కొనసాగిస్తాడని అంటున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.