పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి కూడా బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్‍లో పాల్గొన్నాడు పవన్. ఐతే పవన్ సడన్ గా షూటింగ్‍కి బ్రేక్ ఇచ్చి సింగపూర్ వెళ్ళాడు.
అభిమానులోను ఇటు సినీ పరిశ్రమలోను ఇంత సడన్ గా పవన్ సింగపూర్ ఎందుకు వేళ్ళాడు అని అనుకుంటున్నారు. అసలు పవన్ సింగపూర్ ఎందుకు వేళ్లాడు అంటే రీసెంట్ గా సర్దార్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నంటే పవన్ కాలికి గాయం అయ్యిందట. డాక్టర్స్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చేప్పడంతో పవన్ రెస్ట్ కోసం సింగపూర్ వెళ్ళాడట.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్‍లో వేసిన భారీ సెట్‍లో జరుగుతుంది. పవన్ సింగపూర్ నుంచి వచ్చాక తిరిగి షూటింగ్‍లో పాల్గొంటాడట. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు బాబీ మిగతా నటీనటులపై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నాడట. పవన్ సరసన హీరోయిన్‍గా కాజల్ నటిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ సమ్మర్లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.