Monday, May 5, 2025
- Advertisement -

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కథ!

- Advertisement -

పవన్‌కల్యాణ్‌ హీరో గా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ రేపే (ఏప్రియల్ 8)న రిలీజ్ అవుతోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. కాజల్‌ తొలిసారి ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరసన నటించారు.ఈ నేపధ్యంలో చిత్రం ఎలా ఉండబోతోంది. కథ ఏమిటీ అనే చర్చలు అంతటా నడుస్తున్నాయి.

ఈ సందర్బంగా ఎక్సక్లూజివ్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఓ కథని మీకు అందిస్తున్నాం.

సినిమా ప్రారంభం …రతన్ పూర్ విలేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ మొదలవుతుంది.అలాగే ఊరుని ఏలుతున్న దుర్మార్గుడైన భూస్వామి భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్). అతను ఆ గ్రామంలోని ఇళ్లను కొందరు గూండాలతో పొలిటికల్ పవర్ ని ఉపయోగిస్తూ నాశనం చేయించే పనిలో ఉంటాడు. రతన్ పూర్ లో క్రింద మైన్స్ ఉంటాయి. వాటి కోసం అక్కడ జనాలను నానా రకాల హింసలు పెడుతూంటాడు. అక్కడ రతన్ పూర్ రాజు ముఖేష్ రుషి.

శరద్ కేల్కర్ కు ఎదురుచెప్పలేని నిస్సహాయ స్దితిలో ఉంటాడు. రతన్ పూర్ రాజు ముఖేష్ రుషి రిక్వెస్ట్ పై… పోలీస్ డిపార్టమెంట్ లోని హైయ్యర్ అఫీషియల్స్..సర్దార్ గబ్బర్ సింగ్ ని అక్కడకి ట్రాన్సఫర్ చేస్తారు.సర్దార్ గబ్బర్ సింగ్ కు సిఐ గా ప్రమోషన్ ఇచ్చి రతన్ పూర్ కు ట్రాన్సఫర్ చేస్తారు.పవన్ కళ్యాణ్ ..కాజల్ ఆ రతన్ పూర్ సంస్దానానికి ఏకైక వారసురాలు అని తెలియక ఆమెతో ప్రేమలో పడతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడక్కడా తిక్క చూపిస్తూ..సామాన్య పోలీస్ గా కామెడీ చేస్తూ గడుపుతాడు సర్దార్.దాదాపు ఇంటర్వెల్ దగ్గరలో ఆమె రతన్ పూర్ యువరాణి అని పవన్ కు రివీల్ అవుతుంది.

ఫస్టాఫ్ ఎండింగ్ లో విలన్ శరద్ కేల్కర్ కు, పవన్ కు మధ్య ఛాలెండ్ వస్తుంది. పవన్ ని 72 గంటల్లో ఉద్యోగంలోంచి తీయించేస్తానని శరద్ కేల్కర్ ఛాలెంజ్ చేస్తాడు. తన రాజకీయ పలుకుబడితో పవన్ కళ్యాణ్ జాబ్ తీయించేస్తాడు విలన్.జాబ్ పోయాక…పవన్ ..తణికెళ్ల భరిణిని కలుస్తాడు. భరిణి… పవన్ కు పై అధికారి.

విలన్ తో చేతులు కలిపి ఉంటాడు.తణికెళ్ల భరణిని పట్టుకుని ఏమార్చి, తను మారానని విలన్ శరద్ కేల్కర్ ఇల్లీగల్ ఏక్టవిటీస్ కు సపోర్ట్ చేస్తానని, తన జాబ్ తనకు ఇప్పిస్తే చాలని అంటాడు. పవన్ ..విలన్ కు సపోర్ట్ చేస్తూనే అతని ప్రక్కన ఉంటూనే అతని సామ్రాజ్యాన్ని సైలెంట్ గా కూల్చేస్తాడు. చివరకు సర్దార్ …శరద్ కేల్కర్ పీడను రతన్ పూర్ వాసులుకు తప్పించి, వారు ఆనందంగా హ్యాపీగా జీవించేటట్లు చేస్తాడు. ఎప్పటిలాగే తను ప్రేమించిన రతన్ పూర్ యువరాణిని పెళ్లి చేసుకుంటాడు.

కామెడీ కింగ్ బ్రహ్మానందం … కాజల్ కు మామయ్య గా కనిపిస్తాడు. తుపాకులు అమ్ముతూంటాడు.రావు రమేష్ కు కాజల్ కు సపోర్ట్ గా ఉంటూ.. రాజ్యంలోని వస్తువులను అమ్మటానికి ఆమెకు సహాయపడుతూంటాడు. తమ ట్రస్ట్ ద్వారా విలేజ్ లోని వారి సాయానికి ఆ డబ్బు వాడుతూంటారు.

{youtube}v=Zhjl0GllKVI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -