Friday, May 2, 2025
- Advertisement -

పవన్ రెమ్యునరేషన్‌..షాకింగ్ న్యూస్?

- Advertisement -

టాలీవుడ్ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా మరోవైపు ఎన్నికలకు ముందు తాను కమిట్ అయిన సినిమాలను చకచక పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇందులో పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఉంది. దీంతో పవన్‌ అభిమానులు ఎప్పటినుండో చూస్తున్న ఓజీ కూడా ఒకటి.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ డేట్స్ కూడా ఇచ్చారట.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్‌లోనే ఉంది. తమిళ సూపర్ హిట్ థేరి (2016) కి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండగా ఈ మూవీ కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట పవన్. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా రూ. 170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట పవన్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ రెమ్యునరేషన్ వార్త మాత్రం టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. 2026 సమ్మర్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -