Monday, May 5, 2025
- Advertisement -

ప్రభాస్, అనుష్కల ఎంగెజ్మేంట్ ఎప్పుడంటే..?

- Advertisement -

ప్రభాస్ అనుష్క సినిమాలో నటించినప్పటి నుంచి.. వీరిద్దరిపై చాలా రూమర్స్ వచ్చాయి. త్వరలో వీరు పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బాహుబలి 2 రిలీజ్ అయ్యాక చాలా ఎక్కువ అయ్యాయి.

ఇదే విషయంపై ప్రభాస్ కూడా అనుష్కతో తనకు ఎఫైర్ లేదని.. పెళ్లి లేదని చెప్పాడు. అనుష్క కూడా అదే ప్రభాస్ లానే కొట్టి పరేసింది. అయితే ఇలాంటి సమయంలో కొందరు వీరు పెళ్లి చేసుకుంటారు.. మరి కొందరు అలాంటిది ఏమి లేదని చెప్పడంతో అభిమానులు అంతుబట్టకుండా అయింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.

ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీరిద్దరికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పి.. సోషల్ మీడియాలో ఆ వార్తను హల్ చల్ అయ్యేలా చేశాడు. ప్రభాస్, అనుష్క డిసెంబర్ లో ఎంగేజ్మేంట్ చేసుకోబోతున్నారని ట్వీట్టర్ ట్వీట్ పెట్టాడు. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ అయినా ఉమర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో ఇలా వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు తెలిపాడు.

మరి ఉమైర్ సంధు చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజం ఉందో ప్రభాస్, అనుష్కల్లో ఎవరైనా చెబితే తప్ప క్లారిటీ వచ్చే చాన్స్ లేదు. అసలు టాలీవుడ్ కి తెలియని ఈ న్యూస్ బాలీవుడ్ కి ఎలా తెలిసిందని అందరూ ఆశ్చర్య పోతున్నారు. మరి బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్‌ ఉమర్ సంధు చేసిన ట్వీట్ లో ఏంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -