సలార్ తర్వాత కల్కితో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టారు ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోనున్నారు ప్రభాస్.
ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే కల్కి తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమాలన్ని పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ సగం ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి హను రాఘవపూడి సినిమాలో జాయిన్ కానున్నారు ప్రభాస్. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత కల్కి 2 షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే కల్కి సెకండ్ పార్ట్ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాను పూర్తి చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సలార్ పార్ట్ 2 చేయనున్నారు. ఈ ఐదు సినిమాలు పూర్తయిన తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇలా తన చేతిలో ఆరు పాన్ ఇండియా సినిమాలు ఉంచుకున్నారు ప్రభాస్. మొత్తంగా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రభాస్ అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.