- Advertisement -
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, టీజర్‌లకు అదిరే రెస్పాన్స్ రాగా తాజాగా సెకండ్ లిరికల్ సూసేకి సాంగ్‌ని రిలీజ్ చేశారు. చంద్రబోస్ అందించిన చక్కటి లిరిక్స్ కు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ అదిరిపోయింది. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడిన తీరు మ్యూజిక్ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోండగా బన్నీ సరసన రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహిల్ ఫజిద్, అనసూయ,సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.