లావణ్య తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని…7 ఏళ్ల నుండి శారీరక సంబంధం లేదన్నారు నటుడు రాజ్ తరుణ్. ఇక రాజ్ తరుణ్ -తాను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ ప్రేమలో పడి తనను పట్టించుకోవడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అసలే ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రాజ్ తరుణ్…లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించారు. తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మొదట సహయం చేసింది లావణ్యనే అని.. అందుకే నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నాను అని చెప్పారు. లావణ్య డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే తన లిమిట్స్ తను దాటిపోయిందని ఆమెకు వేరే అతడితో రిలేషన్‌లో ఉందని వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలిపింది.
2017 నుంచి లావణ్యతో దూరంగా ఉంటున్నానని…..ఆమెతో శారీరకంగా సంబంధం కూడా లేదన్నారు. పరువు పోతుందనే ఇన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్నానని చెప్పారు. ఇక నటి మాల్వి మల్హోత్రాపై లావణ్య చేస్తున్న వార్తలు ఆవాస్తవం అని చెప్పారు.