- Advertisement -
ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా ఈ సినిమా తర్వాత పలువరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చరణ్.
తాజాగా తండ్రిబాటలో రోల్స్ రాయిస్ ఫ్యామిలీలో చేరిపోయారు చరణ్. లేటెస్ట్ వెర్షన్ రోల్స్ రాయిస్ కారును కొన్నారు చరణ్. దీని ధర ఏకంగా రూ.7.5 కోట్లు అని సమాచారం.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్ కారులోనే వెళ్లడంతో వీడియోలు వైరల్ గా మారాయి. రోల్స్ రాయిస్ కారుని చరణ్ స్వయంగా డ్రైవ్ చేయడం, ఇందుకు సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తూ తెగ సంబర పడిపోతున్నారు. హైదరాబాద్ లో ఈ మోడల్ కారుకు ఫస్ట్ కొన్న వ్యక్తి రామ్ చరణే కావడం విశేషం.