సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోకి, విలన్ కి మధ్య వచ్చే సన్నివేశాలు రామ్ చరణ్ తెలుగులో రిమేక్ చేయబోతున్న ‘థని ఒరువన్’ సినిమా నుంచి కాపి కొట్టిన్నారు అని సినీ విశ్లేషకులు చేపుతున్నారు. కాపి చేసిన ఆ సన్ని వేశాలు ‘థని ఒరువన్’ చాలా ముఖ్యమైనవట.
అయితే నాన్నకు ప్రేమతో చేసిన ఎన్టీఆర్, సుకుమార్ బానే ఉన్నారు కానీ అసలు చిక్కు చరణ్ కి వచ్చింది. ‘థని ఒరువన్’ సినిమా నుంచి సీన్స్ కాపి చేయడంతో చరణ్ ఈ సినిమాని తెలుగులో చేయకపోవచ్చు అనుకున్నారు అంతా. కానీ చరణ్ మాత్రం థని ఒరువన్ రీమేక్ చేయడానికే నిర్ణయించుకున్నాడు.
నాన్నకు ప్రేమతో కథ, థని ఒరువన్ కథ వేరు కాబట్టి ప్రేక్షకులు తన సినిమా ఆదరిస్తారు అంటున్నాడు. ప్రస్తుతం స్క్రిఫ్ట్ పనులు జరుగుతున్న ఈ రీమేక్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. చరణ్ మాత్రం ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉండటం వల్ల ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.