Sunday, May 4, 2025
- Advertisement -

నిన్న బన్నీ..నేడు చరణ్‌!

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరోల సినిమా షూటింగ్‌లతో వైజాగ్‌లో సందడి వాతావరణం నెలకొంది. నిన్న అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా శరవేగంగా సాగుతోంది.అత్యంత కీల‌కంగా భావించే ఈ షెడ్యూల్‌ కోసం అల్లు అర్జున్‌ వైజాగ్ రాగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు.

ఇక ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతోంది. ఆర్‌కె బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ జరగనుండగా బీచ్‌లో పొలిటికల్ మీటింగ్ సెట్ ని నిర్మించారు. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు వైజాగ్ చేరుకున్నారు రామ్ చరణ్. అంతే అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. ఇక ఈ షూటింగ్ కోసం మూవీ టీం అంతా నిన్ననే వైజాగ్ చేరుకుంది.

ఎయిర్ పోర్ట్ వద్ద రామ్ చరణ్ భారీ అభిమానాన్ని చూసిన ఎస్‌జె సూర్య షాక్ అయ్యారు. మార్చి 19 వరకు వైజాగ్‌లో షూటిగ్ జరగనుంది. ఈ నెల మార్చి 27న చరణ్ పుట్టినరోజు కానుకగా జరగండి సాంగ్ రిలీజ్ కాబోతుంది.ఆ తర్వాత హైదరాబాద్‌లో RC16 ప్రారంభంకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -