ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నారు రామ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసింది చిత్రయూనిట్.
ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు రామ్. డబుల్ ఇస్మార్ట్ కోసం ఒకే నెలలో ఏకంగా 18 కిలోలు తగ్గినట్లు తెలిపాడు. అయితే తనలా ఎవరూ ట్రై చేయొద్దని ఇదే క్రమంలో సూచించారు రామ్. హెచ్చరిస్తున్నాడు.
పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ క్లిక్ ఇచ్చిందని అందుకే ఈ సాహసం చేసినట్లు తెలిపారు రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలాగే ఈసినిమాలోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నామని స్కంద రిలీజైన తర్వాత తనకు 2 నెలలు మాత్రమే ఉందన్నారు. అయితే తర్వాత వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులు ఉండి.. ఫుల్లుగా వర్కౌట్ చేసి 18 కిలోఉల తగ్గినట్లు చెప్పారు. అయితే తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరని తనలా ఎవరు ప్రయత్నించవద్దని సూచించారు. మొత్తంగా సినిమా కోసం రామ్ చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.