Monday, May 5, 2025
- Advertisement -

డ్రగ్స్ వల్ల వాళ్లు చచ్చిన పర్లేదు – రానా

- Advertisement -

బాహుబలి తో బాగా క్రేజ్ తెచ్చుకున్న దగ్గుబాటి రానా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకుని చనిపోయినా రానా అసలు బాధపడట. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి తమిళ వెర్షన్ ఆడియో వేడుక కోసం చెన్నై వెళ్లిన రానా.. ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు దాటిన దాటిన వాళ్లు డ్రగ్స్ తీసుకుంటే తనకేమి బాధ ఉండదని.. అది వాళ్ల సంబంధించిన విషయం.. డ్రగ్స్ తీసుకొని వాళ్ల ఆరోగ్యాన్ని వాళ్లు దెబ్బ తీసుకుంటున్నారు.

టాలీవుడ్ లో ఎవరైనా డ్రగ్స్ తీసుకొని చచ్చినా ఐ డోంట్ కేర్ కానీ.. చాలా బాధకరమైన సంగతి ఏంటంటే.. 12-14 ఏళ్ల వయసున్న స్కూలు పిల్లలు డ్రగ్స్ కు అలవాటుపడి డ్రగ్స్ వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎక్కువ బాధపెడుతోంది. ఆ స్కూళ్లకు మన పిల్లలు వెళ్తుంటారు. వాళ్లు ఏమైపోతారో అన్న బాధ ఉందని.. సమాజం ఏమవుతుందో అన్న భయం పుడుతుందని రానా అన్నారు. డ్రగ్స్ రాకెట్ పై మీడియా చేస్తున్న తీరు కూడా ఆవేదన కలిగిస్తోందని అన్నారు.

ఈ సొసైటీలో సినిమా వాళ్లు ఒక్క శాతం లోపే ఉంటారు. పేపర్ చూస్తే అందులో మిగతా 99 మందికి సంబంధించిన వార్తలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ సినీ పరిశ్రమకు సంబంధించి ఏమైన జరిగితే మరి ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తారు. ఇది ఎంత వరకు సమంజసమో మీడియా వాళ్లే ఆలోచించుకోవాలి” అని దగ్గుబాటి రానా అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -