ఎక్కడ అయినా.. వినోదంకు ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తారు.. వినోదం ఉన్న షోలు బాగా హిట్ అయిన విషయం తెలిసిందే. అలానే తెలుగులో కూడా చాలానే అలాంటి షోలు ఉన్నాయి కానీ అందులో బాగా ఫాపులర్ అయిన షో జబర్దస్త్. ఈ షో కోసం గురు, శుక్రవారాలు బుల్లితెర అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక ఈ జబర్ధస్త్ లో ముఖ్యంగా హైపర్ ఆది చేసే స్కిట్స్ అంటే జనాలు పగలబడి నవ్వుతారు.
అతని ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అంతేకాకుండా యూట్యూబ్ లో కూడా అతని వీడియోస్ కి మిలియన్స్ వ్యూవ్స్ వస్తున్నాయి. అయితే అక్టోబర్ 19 న గురువారం వచ్చిన జబర్దస్త్ లో ఆది మిస్ అయ్యాడు. ఆది లేకపోవడం తో ఆ ఎపిసోడ్ చాలా మందికి నచ్చలేదు. యూట్యూబ్ లో రాజు గారి స్కిట్ కి వ్యూస్ తక్కువ వచ్చాయి. కామెంట్స్ లో అందరు ఆది మిస్సింగ్ అన్నారు. ఇక ఆది లేకుంటే జబర్దస్త్ లేదు కొందరు అన్నారు. ఆది లేకుంటే స్కిట్ వరస్ట్ గా ఉందని మరికొందరు కామెంట్ చేసారు. మరి అంతలా ఆడియన్స్ ఆదిని మిస్ అవుతుంటే..ఆది స్కిట్ లో ఎందుకు కనిపించలేదు..? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటది.!
ఆది నిన్నటి స్కిట్ లో లేకపోవడానికి కారణం ఉంది. అదేంటంటే.. నిన్నటి స్కిట్ లో ఆది లేకపోవడానికి కారణం “హైపర్ ఆది” లండన్ లో ఉండడం. లండన్ లో ఏం చేస్తున్నాడు? టూర్ కి వెళ్లాడా..? అనుకుంటున్నారా.! నాగ బాబు కొడుకు “వరుణ్ తేజ్” నెక్స్ట్ మూవీ “తొలిప్రేమ” సినిమాలో ఆది కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం “లండన్” లో జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ఆది లండన్ కి వెళ్ళాడు. అందుకే అక్కడ నుంచి రాలేక.. ఆదీ స్కిట్ చేయలేకపోయాడు. అది అసలు విషయం.