Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ పై ఇన్‍డైరెక్ట్ గా కామెంట్స్ చేసిన రేణు

- Advertisement -

ఇప్పుడు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మాటలతో తూటాలు పేల్చుతోంది. పవన్ నుంచి విడిపోయాక ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటూ పిల్లల పెంపకానికే పరిమితమైపోయారు. తాజాగా ఆమె ఓ టీవీ చానెల్ లో డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె పలు కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పవన్ గురించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తవించినట్లుండడంతో సంచలనంగా మారుతున్నాయి.

కళ్యాణ్ బాబు నుంచి ఆమె డైవర్స్ తీసుకుంటున్నప్పటికీ.. పవన్ సహచర్యం కారణంగా కలిగిన ఇద్దరు పిల్లల ఆలనా పాలనాయే లోకంగా జీవిస్తుండడంతో ఆమెను తమ వదినగా ఆరాధిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ పేరు వింటనే కొపడుతున్నారు. అయితే ఇటివలే రేణు దేశాయ్.. రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ స్టేట్మెంట్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడు ఉంటే బాగుంటుందని రేణు చెప్పిన విషయాలపై నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేయడంపై రేణు వాటిని స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

దాంతో ఆ ఫోస్ట్ వైరల్ అయ్యింది. ఈ ఫోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం అసలు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం.. ఇలాంటి ఆలోచనలు ఉన్న మగవాళ్ల మధ్య ఉన్నామని బాధపడుతున్నా.. వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. ఈ దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు.

ఎన్నిసార్లు అయిన పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి అదే పని చేస్తే తప్పా..? తోడు లేకుండా జీవితాంతం బ్రతాకాలా..? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో’ అంటూ రేణు దేశాయ్‌ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ స్పందించిన తీరు ఆలోచింపజేసేదే అయినా.. ఇవి పరోక్షంగా పవన్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అనుకోవాలేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -