- Advertisement -
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సికే ప్రాధాన్యత ఇస్తారు ఆర్జీవీ. ఇక ఆర్జీవీ నుండి సినిమా వస్తుందనే వార్త కంటే ఆయన ఎవరిని కలిసినా అది సెన్సేషనే.
తాజాగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని కలిశారు ఆర్జీవీ. విజయ్ సేతుపతితో ఆర్జీవీ మాట్లాడుతుండగా తీసిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. విజయ్ సేతుపతిని చాలా సార్లు స్క్రీన్ మీద చూసిన తర్వాత, ఇప్పుడు నిజంగా ఇతన్ని కలిసాక స్క్రీన్ మీద కంటే బయటే చాలా బాగున్నాడు అని తనదైన శైలీలో పోస్ట్ చేశారు.
ఇక ఆర్జీవీ పోస్ట్ వైరల్‌గా మారగా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అది సూపర్ హిట్ కావడం ఖాయమని, ఇది ఆర్జీవీకి ఖచ్చితంగా కమ్ బ్యాక్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.