- Advertisement -
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనపై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ ఘటనకు అల్లు అర్జున్ ను నిందించడం కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలకు స్టార్లను రావొద్దనడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం.. కరెక్ట్ కాదని అన్నారు.
భారీ సంఖ్యలో జనం వచ్చిన సందర్భాల్లో తొక్కిసలాటలు జరగడం కామన్…సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మొదటిసారేమి కాదు అన్నారు. దశాబ్ద కాలంలో లో జరిగిన తొక్కిసలాట ఘటనలు, అందులో వేల సంఖ్యలో చనిపోయిన జనం ఉన్నారని తెలిపారు.
గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడో, మరేదైనా జరిగితే విరాళాలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా షోలు వేసి వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చేవారని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ షో కి వచ్చిన బన్నీ ఈ ఘటనకి కారణం ఎలా అవుతాడని అన్నారు. దీని పై ఓ మంచి నిర్ణయం ఆలోచించి తీసుకుంటారని కోరుకుంటున్నా అని సుదీర్ఘ పోస్ట్ చేశారు ఆర్జీవీ.