కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా రోజుకో వార్తతో దేవర ట్రెండింగ్‌గా మారింది. ఇక తాజాగా ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాలోని ప్రతి సీన్‌ని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బడ్జెట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావట్లేదట.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్.అందుకే దేవరపై భారీ అంచనాలు నెలకొనగా ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు రూ.40 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో బిగ్గెస్ట్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.