Tuesday, May 6, 2025
- Advertisement -

సినిమాలు వదిలేస్తున్నట్టేనా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా.. సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై.. పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్.. ప్రతి సీన్ అదిరిపోయేలా పిక్చరైజేషన్.. భారీ మొత్తానికి అమ్ముడుపోతున్న రైట్స్.. ఇలా ప్రతి విషయంలో సర్దార్ సెన్సేషనల్ గా ముందుకు దూసుకుపోతోంది. విడుదలకు ముందే.. ఇంత హంగామా క్రియేట్ చేస్తే.. రిలీజ్ నాటికి సర్దార్ ఇంకెంత హడావిడి చేస్తాడో అని అంతా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సర్దార్ గురించి ఓ కొత్త విషయం.. ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను.. తన ప్రియమైన అభిమానులకు అంకితం చేస్తున్నట్టు.. పవన్ సినిమా టైటిల్ కార్డ్స్ లో వేయనున్నాడట. ఇంత వరకు.. ఫ్యాన్స్ పై మాటల్లో, చేతల్లో అభిమానం చూపిన పవన్.. ఇప్పుడు స్క్రీన్ సాక్షిగా తన ప్రేమను చాటుకోనున్నాడట. ఇది తెలిసి ఫ్యాన్స్.. అప్పుడే సంబరాలు కూడా మొదలు పెట్టేశారట.

 అయితే.. ఫ్యాన్స్ కు అంకితం చేయడం వరకూ బాగానే ఉంది. కానీ.. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఇలా ఎందుకు అని కొందరు సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే సినిమాలు మానేస్తానని.. పవన్ ఈ మధ్య బాలీవుడ్ క్రిటిక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ రూట్ లోనే.. పక్కాగా తీస్తున్న సర్దార్ సినిమాను.. ఫ్యాన్స్ కు అంకితం చేసేందుకు పవర్ స్టార్ డిసైడై ఉంటారని క్రిటిక్స్ డౌట్ పడుతున్నారు.

ఇది తెలిసిన పవన్ ఫ్యాన్స్ మళ్లీ డిజప్పాయింట్ అవుతున్నారు. సినిమాలు ఆపొద్దని.. అవసరమైతే రాజకీయాలకే పవన్ దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి.. ఓ నిర్ణయం తీసుకుంటే ఎలా అయినా సరే అమలు చేసే పవన్.. ఇప్పుడు ఫ్యాన్స్ రిక్వెస్ట్ విషయంలో ఎలా స్పందిస్తారు? అసలు.. నిజంగానే సర్దార్ గబ్బర్ సింగ్ ను ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నారా? చేస్తే కారణమేంటి.. అన్న విషయాలపై ఎలాంటి వివరణ ఇస్తారు? వెయిట్ చేయాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -